పంటతడుస్తుందేమోనని భయాందోళన

0
TMedia (Telugu News) :

రాత్రనకా పగలనకా పండించిన పంట లారీల కొరతతో కళ్లలోనే తడుస్తుందేమోనని భయాందోళన చెందుతున్నారు నందిపేట మండలం రైతులు.

s s consultancy

టీ మీడియా ప్రతినిధి నిజామాబాద్ జిల్లా నందిపేట్

నందిపేట మండలంలో లారీల కొరతతో పండించిన వరి ధాన్యాలు రైసుమిల్లు లకు వెళ్లక కల్లాలు, రోడ్లపై ఉండడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. రాబోయే రెండు మూడు రోజుల్లో తుఫాను ప్రభావం ఉంటుందని అని తమ వారి ధాన్యాలు తడిసి పోతే పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతూ అధికారులకు మొరపెట్టుకున్నారు. నందిపేట మండలం ఐలాపూర్, చిమ్రాజ్ పల్లి సొసైటీల పరిధిలోని వెల్మల్, తల్వేద, కొండూర్ గ్రామాలలో ఇంకా వారి ధాన్యాలు కల్లాల పై నే ఉండడంతో రైతులు సొసైటీ చైర్మన్ లకు, అధికారులకు మొర పెట్టుకుంటున్నారు. ఈ సందర్భంగా వెల్మల్ గ్రామానికి చెందిన రైతులు మాట్లాడుతూ కష్టపడి పండించిన పంటను కేవలం లారీల కొరతతో నష్టపోయే టట్టు చేయడం ఎంతవరకు సబబు అని రెండు మూడు రోజుల్లో వర్షాలు పడితే దాన్యం నాని పోతే నష్టం ఎవరు భరించాలని రైతులు మీడియా ముఖంగా మొరపెట్టుకున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి లారీల కొరత లేకుండా చూసి మా వరి ధాన్యాలను మిల్లులకు చేరే విధంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఐలాపూర్ సొసైటీ చైర్మన్ సిద్దాపురం సుదర్శన్ మాట్లాడుతూ,.. మండలంలో మా సొసైటీ పరిధిలో నాలుగు లక్షల పైచిలుకు బ్యాగులను మిల్లులకు తరలించామని, సొసైటీ పరిధిలో ఉన్న అన్ని గ్రామాల్లో అయిపోగా ఒక్క వెల్మల్ గ్రామంలోనే 40 వేల బ్యాగుల వరకు లారీల కొరతతో తరలించడంలో వెనకబడ్డమని అధికారులు రైతుల ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని సరిపడా లారీలను మాకు పంపితే రెండు మూడు రోజులలో మొత్తం ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తామని తెలిపారు. కరోనా కష్టకాలంలో సొసైటీ తరఫున రైతుల బాధలు తెలిసినవాళ్లం కనుకే హమాలీల కొరత లేకుండా ప్రతి గ్రామంలో తగు సిబ్బందిని సిద్ధం చేసుకొని రెడీగా ఉన్నామని కేవలం లారీల కొరతతో ఇబ్బంది కలుగుతుందని తక్షణమే అధికారులు స్పందించి లారీలను పంపినట్లయితే ఒక్క దాన్యం బస్తా కూడా లేకుండా ఖాళీ చేస్తామని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో గ్రామానికి చెందిన రైతులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.