అనాధ పిల్లలను ఆదుకుంటాం. CDPO గజలక్ష్మి వెల్లడి

0
TMedia (Telugu News) :

అనాధ పిల్లలను ఆదుకుంటాం. CDPO గజలక్ష్మి వెల్లడి

s s consultancy

టి మీడియా 10 మే.తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజక వర్గం

                                                                                                                                                                                        కోవిడ్ మహమ్మారి కారణంగా తల్లి దండ్రులను కోల్పోయి అనాధలుగా మారిన చిన్నారులను అన్ని విధాలుగా  రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని కపిలేశ్వరపురం ఐసీడీఎస్ ప్రాజెక్టు సిడిపీవో జి.గజలక్ష్మి అన్నారు. ఆలమూరు లో ఆమె సోమవారం మాట్లాడుతూ కరోనా వైరస్ ప్రభావం వల్ల ఉమ్మడి కుటుంబాలు, పచ్చని సంసారాలు చిన్నాభిన్నం అవుతున్నాయని ఆమె అవేదన చెందారు. అటువంటి పరిస్థితుల్లో అనాధలుగా మారిన చిన్నారుల సంరక్షణ కోసం 181లేదా 1098 (చేయిల్డ్ లైన్) ఫోన్ చేసి పునరావాస సేవలను పొందాలని సూచించారు. అలాగే సమీప అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఐసీడీఎస్ అధికారుల దృష్టికి తీసుకు రావాలన్నారు. కోవిడ్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి పిల్లల బాధ్యత కూడా తాత్కాలికంగా ఐసీడీఎస్ శాఖ చేపడు తుందన్నారు. సూపర్ వైజర్లు టీయెన్వీ నాగలక్ష్మి,  బి.వరలక్ష్మి పాల్గొన్నారు.

N. యువరత్న. టి మీడియా ప్రతినిధి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.