బ్లాక్ ఫంగస్ బాధితుడుకు- అండగా నిలిచిన సభాపతి

0
TMedia (Telugu News) :

బ్లాక్ ఫంగస్ బాధితుడుకు-నేనున్నాను అంటూ అండగా నిలిచిన సభాపతి

s s consultancy

కోవిడ్ రెండో దశ వ్యాప్తితో యావత్ దేశం ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ మహమ్మారి నుంచి ఎలా బయటపడాలో తెలియక సతమతమవుతుంటే ఇది చాలదన్నట్లు ఇఫ్పుడు బ్లాక్ ఫంగస్ కమ్మేస్తోంది. కోవిడ్ బాధితులకు బ్లాక్ ఫంగస్ ముప్పు ముంచుకొస్తోంది. కొవిడ్ వ్యాధి చికిత్సలో స్టెరాయిడ్లు అధికంగా వాడటం వల్ల తలెత్తే మ్యూకర్ మైకోసిస్ వ్యాధినే బ్లాక్ ఫంగస్ అని పిలుస్తున్నారు.
తాజాగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ కేంద్రంలోని కోమ్మ శ్రీనివాస్ అనే యువకునికి నెల రోజుల క్రితం కోవిడ్ వచ్చితగ్గింది. కోవిడ్ మందుల దుష్ప్రభావాల వల్ల తాజాగా బ్లాక్ ఫంగస్ వ్యాధితో బాధపడుతూ హైదరాబాదులోని యశోద హాస్పిటల్ వేల్లగా అక్కడ బెడ్లకు కొరత ఉండటంతో ఇబ్బందులు పడుతూ.. దిక్కుతోచని స్థితిలో డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డిని ఫోన్లో సంప్రదించగా, ఆయన తక్షణం వైద్య సిబ్బందితో మాట్లాడి బెడ్ ఇప్పించారని బాధితుడి భార్య ధనలక్ష్మి తెలిపింది. అలాగే స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా వైద్య సిబ్బంది తో మాట్లాడారని, వారి సహకారం వల్లే ఇంజక్షన్లు మందులు ఇస్తున్నారని అన్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు సార్ అనగానే మాకు సహాయం చేసిన భాస్కర్ రెడ్డి,స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి, పాత బాలకృష్ణకు ఆమె ధన్యవాదాలు తెలియజేశారు.

✍️టీ-మీడియా బాన్సువాడ కామారెడ్డి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.