సి.పి.యం అల్పాహార కార్యక్రమానికిచేయూత

0
TMedia (Telugu News) :
s s consultancy

సి.పి.యం అల్పాహార కార్యక్రమానికి
టీ మీడియా,జూన్ 7,మధిర:
మధిర ప్రభుత్వ వైద్యశాల నందు కరోనా టెస్టులు, టీకా వేయించుకున్న వారికి సి.పి.ఎం పార్టీ మధిర టౌన్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అల్పాహార కార్యక్రమానికి TSUTF మధిర యూనిట్ ₹5000/- లు ఆర్థిక సహాయాన్ని అందించింది. ఈరోజు స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మధిర మండల అధ్యక్ష కార్యదర్సులు ఏ. వినోద్ రావు, ఎస్. కె.నాగూర్ వలిలు సి.పి.యం. టౌన్ కార్యదర్శి శీలం నరసింహారావు, సి.పి.యం. మండల కార్యదర్శి మంద సైదులుకి ఈ ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ఆర్.లక్ష్మణ రావు మాట్లాడుతూ…… ప్రస్తుత కోవిడ్ సమయంలో సి.పి.యం. పార్టీ కరోనా టెస్టులు, వాక్సినేషన్ కోసం వచ్చే వారికి అల్పాహారం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.TSUTF మధిర యూనిట్ ఉపాధ్యాయుల నుండి ఇప్పటికే 33 వేల రూపాయలు వసూలు చేసి ఖమ్మంలో బి.వి.కె. ఆధ్వర్యంలో జరుగుతున్న ఐసోలేషన్ కేంద్రానికి కూడా విరాళాలు అందజేయడం జరిగిందని…ఈ సందర్భంగా మధిర యూనిట్ కి కూడా ఆయన అభినందనలు తెలియజేశారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా కరోనా తీవ్రత గమనించి ప్రజలందరికి వాక్సినేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని, పాఠశాలలు ప్రారంభం అయ్యేలోగా ఉపాధ్యాయులందరికి వాక్సిన్లు వేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు భీమశంకర రావు, లాల్ అహ్మద్, సి.పి.యం పార్టీ టౌన్ కమిటీ సభ్యులు రాధాకృష్ణ, మురళి, ఊట్ల శంకర రావు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.