బెల్ట్ షాప్ ల పై పోలీసుల దాడులు.

0
TMedia (Telugu News) :
s s consultancy

బెల్ట్ షాప్ ల పై వన్ టౌన్ పోలీసుల దాడులు.
టీ మీడియా//రామగుండం //పెద్దపల్లి జిల్లా.
రామగుండం పోలీస్ కమీషనర్ వి.సత్యనారాయణ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు గొదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పవర్హౌస్ కాలని నివసించే బంగారి నర్సయ్య 66 సం//లు అను అతను ఎలాంటి అనుమతులు లేకుండా వైన్ షాప్ నుండి మద్యం తీసుకోని వచ్చి లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి తమ తమ ఇంటినే బెల్ట్ షాప్ గా చేసి మద్యం అమ్ముతున్నారు అనే పక్కా సమాచారం మేరకు రైడ్ చేసి సుమారు 15,060/- రూపాయల విలువ గల మద్యం పట్టుకోవడం జరిగింది.పట్టుకున్న మద్యంను మరియు నిందితులను తదుపరి విచారణ నిమిత్తం గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేయడం జరిగింది.ఇకనుండి గోదావరిఖని వన్ టౌన్ పరిధిలో ఎవరైనా మద్యం అక్రమ రవాణా చేసిన మరియు ఇంటిలో నిల్వ చేసుకున్న గాని వారి మీద చట్టపరంగా కేసులు నమోదు చేయడమే కాకుండా వారి మీద పీడీ యాక్ట్  నమోదు చేయడం జరుగుతుందని గోదావరిఖని సీఐ రమేష్ బాబు గారు హెచ్చరించారు ఇట్టి కార్యములలో,కానిస్టేబుల్ నిజాంపేట్ శేఖర్,శ్రీనివాస్,సదయ్య హోమ్ గార్డ్స్ రాజశేఖర్, శెంకర్ లు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.