ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

0
TMedia (Telugu News) :

ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం..

జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి

s s consultancy

టీ మీడియా ప్రతినిధి మంచిర్యాల జిల్లా

మంచిర్యాల జిల్లా ప్రతినిధి,జూన్ 22,

జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జాతీయ ఆరోగ్య మిషన్ క్రింద సైకియాట్రిస్ట్, ఫిజిషియన్ / మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్సెస్ అండర్ ఎన్.ఎం.హెచ్.పి., ఎన్.పి.పి.సి., ఎన్.పి.సి.డి.ఎన్., ఎ.హెచ్./సి.హెచ్సి. ఎన్.సి.డి. క్లినిక్స్ పోస్టులను ఒప్పంద / పొరుగు సేవల ప్రాతిపదికన భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోస్టులకు గాను ఎం.డి. సైకియాట్రి / డిప్లొమా ఇన్ సైకియాట్రి, ఎం.డి./ ఎం.బి.బి.ఎన్., ఎం.ఎన్.సి. /బి.ఎన్.సి./జి.ఎన్.ఎం. అర్హత గల వారు దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు ఫారం, నోటిఫికేషన్ వివరాలను జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో పొందవచ్చని, పూర్తి చేసిన దరఖాస్తు ఫారములను ఈ నెల 23వ తేదీ ఉదయం 10.30 గం||ల నుండి 24వ తేదీ సాయంత్రం 5 గం॥ల లోగా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో సమర్పించాలని, ఈ అవకాశాన్ని ఆసక్తి. అర్హత గల అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.