24న ‘సేంద్రియ సాగు’పై అవగాహన కార్యక్రమం..ఆగ్రోస్ ఆధ్వర్యంలో “మన టీవీ”లో ప్రత్యేక్ష ప్రసారం

0
TMedia (Telugu News) :

24న ‘సేంద్రియ సాగు’పై అవగాహన కార్యక్రమం
ఆగ్రోస్ ఆధ్వర్యంలో “మన టీవీ”లో ప్రత్యేక్ష ప్రసారం
రైతుల సందేహాలకు సమాధానాలు

s s consultancy

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ – టీఎస్ ఆగ్రోస్ మరో ముందడుగు వేసింది. ఈ ఏడాది జూన్‌ 1 నుంచి వానా కాలం ప్రారంభం కాబోతున్న దృష్ట్యా… సేంద్రియ సాగు విధానంపై రైతులకు మరింత అవగాహన కల్పించేందుకు ఆగ్రోస్ సంస్థ సిద్ధమైంది. ఈనెల 24వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు హైదరాబాద్ నుంచి తెలంగాణ ప్రభుత్వ “మన టీవీ”లో ఆగ్రోస్ ఆధ్వర్యంలో ‘సేంద్రియ సాగు’పై ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని ఆ సంస్థ ఖమ్మం జిల్లా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ హరీశ్‌ శ్రీరామదాసు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి టీఎస్ ఆగ్రోస్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కె.రాములు, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టర్ ఆర్.జగదీశ్వర్‌ పాల్గొంటారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సేంద్రియ సాగు విధానం, వ్యవసాయ శాఖ అందిస్తున్న పథకాలు, రాయితీలు, ప్రోత్సాహం, మార్కెటింగ్ వంటి అంశాలపై రైతులు అడిగే ప్రశ్నలు, సందేహాలకు సమాధానాలు, సూచనలు చేస్తారని చెప్పారు. ఆగ్రోస్ సంస్థ ప్రవేశపెట్టిన “తెలంగాణ సిరి” పేరిట సిటీ కంపోస్ట్ ఉద్దేశం ఏమిటి…? దాని వల్ల కలిగే బహుళ ప్రయోజనాలు, భూసార పరీక్షల ప్రాధాన్యత వంటి అంశాలపై క్లుప్తంగా వివరిస్తారని ఇస్తారని స్పష్టం చేశారు. కీలక వ్యవసాయంలో లాభాలు పొందడానికి ఆగ్రోస్ అందించే ఈ సువర్ణ అవకాశాన్ని రైతులంతా పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని హరీశ్‌ విజ్ఞప్తి చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.