ఇంద్రవెళ్లి సభ గురుంచి కాంగ్రెస్ నేతల సమావేశం

0
TMedia (Telugu News) :

టీమీడియా ఇంద్రవెళ్లి;
మాజీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్ నివాసంలో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి లో ఆగస్ట్ 9 న నిర్వవహించనున్న లక్ష మందితో జరిగే కార్యక్రమం పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గరెడ్డి తో చర్చించిన మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు

* సభ నిర్వహణ, ఏర్పాట్ల పై సమీక్షించిన నేతలు..

* తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద సభ ఎప్పుడు జరుగలేదు..

* ఆదిలాబాద్ జిల్లాలో 7 సంవత్సరాల తర్వాత ఇప్పటివరకు ఏ పార్టీ అతిపెద్ద సభ నిర్వహిస్తున్నామని చెప్పిన ప్రేమ్ సాగర్ రావు

* పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లక్ష మందితో సభ నివాహిస్తామని చెప్పిన మాట వాస్తవ రూపం దాల్చెవిధంగా సభ ఉంటుందని ప్రేమ్ సాగర్ రావు అన్నారు..

* ఈ సమావేశంలో సభ ఏర్పాట్ల పై ప్రణాళిక పై చర్చించారు…

* ఇంద్రవెల్లి లో 18 ఎకరాల స్థలం లీజుకు తీసుకొని సభ స్థలి ఏర్పాటు చేయనున్నారు..

s s consultancy

* ఆదిలాబాద్ నియోజకవర్గం నుండి 15 వేల మందికి పైగా బోథ్ నియోజకర్గం నుండి 18 వేలు..అసిఫాబాద్ నుండి 15 వేలు, ఇంద్రవెల్లి, సిరికొండ మరియు ఉట్నూర్ నుండి 20 వేల పైన , ఖానాపూర్ , కడెం ,జన్నారం మూడు మండల నుండి 6 వేలు ,సిరిపూర్ నియోజకవర్గం నుండి 1000 మంది ,బెల్లంపల్లి నియోజకవర్గం 3 వేల పైన,చెన్నూరు నియోజకవర్గం నుండి 3 వేలు,మంచిర్యాల నుండి 9 వేలు,ముధోల్ నుండి 3 వేలు ,నిర్మల్ నుండి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు,నాయకులు హాజరవుతారు..

* దీంతో పాటు బాల్కొండ,ఆర్ముర్,జగిత్యాల,ధర్మపురి, కోరుట్ల, రామగుండం , బోధన్, ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలో నుండి పెద్ద ఎత్తున నాయకులు,కార్యకర్తలు హాజరౌతారు..

* ఈ సమావేశంలో మాజీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్ ,మాజీ విప్ అనిల్ ,మాజీ ఎమ్మెల్యే వేము నరేంద్ర రెడ్డి ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

* మాజీ విప్ ఎరవత్రి అనిల్ కూడా పాల్గొని సభకు సంబంధించిన తగు బాధ్యతలు తీసుకుంటానని అన్నారు..

* ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నుండి జన సమీకరణ పై పీసీసీ సీనియర్ నాయకులు ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ని నియోజకవర్గాల వారిగా సమన్వయ కర్తలను నియమించడం జరిగింది.

* గ్రౌండ్ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి

* ఈ నెల 7 తేదీ 11 గంటలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గరెడ్డి,మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్,మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు లు,ప్రస్తుత ఎమ్మెల్యే లు,ఎమ్మెల్సీ ,మాజీ మంత్రులు,మాజీ ఎమ్మెల్యే లు,మాజీ ఎంపీలు ,ఆ జిల్లాలో ఉన్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు,
పీసీసీ తరుపున నియమించిన సమన్వయ కర్తలు ,4 జిల్లా ప్రెసిడెంట్లు,జిల్లా కార్యవర్గం, మండల ప్రెసిడెంట్లు ప్రజా ప్రతిజినిధులు అందరూ కూడా సభ స్థలాన్ని విసిట్ చేస్తారు..

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.