రాష్ట్రం లో ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది….హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు

0
TMedia (Telugu News) :
s s consultancy

రాష్ట్రం లో ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది….హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు
టి-మీడియా/హైదరాబాద్(మే-13):
తెలంగాణా రాష్ట్రం లో కొరోనా పరిస్థితుల నేపథ్యంలో లాక్ డౌన్ విధించడం పై సీయం అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సీ.యస్ మరియు సీనియర్ ఐ.ఏ.యస్ ల సమన్వయం తో కరోనా పై టాస్క్ ఫోర్స్ కమిటీని నియమించిందని దానిలో భాగంగా కమిటీ నిన్న సమావేశమై పలు విషయాలపై చర్చించారని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వివరించారు.
రాష్ట్రంలో విధించిన రాత్రి కర్ఫ్యూ మరియు లాక్ డౌన్ వలన కరోనా కేసులు కొత్తగా నమోదయ్యే ఇన్ఫెక్షన్స్ మరియు మరణాల సంఖ్య లో తగ్గుదల కనిపిస్తుందని ఆయన తెలియజేశారు. రాష్ట్రం లో ఈరోజుకు 71221 టెస్టులు చేయగా 4692 కేసులు పాజిటివ్ గా నిర్దారణ అయ్యాయని 6876 మంది కోలుకున్నారని ఇందులో 33 మంది చనిపోయారని చికిత్స తీసుకుంటున్నవారు హోంఐసోలేషన్ కలిపి 56917 మంది ఉన్నట్లు తెలియజేశారు.
ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణా రాష్ట్ర ప్రజల సహకారంతో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని ప్రజలంతా తమ సంపూర్ణ సహకారాన్ని అందించాలని కోరారు.
కరోనా తగ్గుముఖం పడుతున్న ఇలాంటి సమయంలో ప్రజలు వైన్ షాపుల ముందు, కూరగాయల మార్కెట్ లో, కిరాణా షాపుల ముందు క్యూలైన్ లు కడుతున్నారని ఇది మనందరికీ ముప్పు లా దాపురిస్తుందని. కేవలం ఇంటికి ఒక్కరు మాత్రమే అత్యవసర పరిస్థితుల్లో బయటకు రావాలని అనవసరంగా ఇళ్ళ నుండి బయటకు రావద్దని కోరారు.
రాష్ట్రం లో ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో ఎక్కువగా ప్రాణ నష్టం జరగకుండా ప్రభుత్వానికి, పోలీసు సిబ్బందికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రం లోని అన్ని గవర్నమెంట్ హాస్పిటల్ మరియు ప్రైవేటు హాస్పిటల్ లో రకాల అత్యవసర సేవలు అందుబాటులో ఉన్నాయని ఈ లాక్ డౌన్ లో పోలీస్ వారి సహకారంతో అన్ని అత్యవసర సేవలకు పొందవచ్చని, వ్యాక్సినేషన్ విషయంలో మే-31 వరకు 45 ఏండ్ల పైబడిన వారికి రెండవ డోసు కి ప్రాధాన్యత నివ్వడం జరుగుతుందని వివరించారు. అనవసరంగా ఆన్లైన్ లో నమోదు చేసుకోవద్దని సూచించారు. కోవ్యాక్సిన్ విషయంలో 6 నుండి 8 వారాల లోపు కోవీషీల్డ్ విషయంలో 4 నుండి 6 లోపు రెండవ డోసు తీసుకోవచ్చని అనవసరంగా భయాందోళనలకు గురి కావద్దని సూచించారు. ప్రభుత్వం ఈ విషయం లో ప్రజలకు జవాబుదారీగా ఉంటుందని వివరించారు.
అదేవిధంగా బెడ్స్ విషయంలో పోయిన సంవత్సరం సెప్టెంబర్ 3 నాటికి 18232 బెడ్స్ ఉంటే ఇప్పుడు 53560 బెడ్స్ ఉన్నట్లు తెలియజేశారు. అదేవిధంగా హాస్పిటల్స్ విషయంలో 42 గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉండగా ఇప్పుడు 110 హాస్పిటల్స్ ఉన్నట్లు, ప్రైవేటు హాస్పిటల్స్ 236 ఉంటే ఇప్పుడు 1136 ఉన్నట్లు తెలియజేశారు. అదేవిధంగా ఆక్సిజన్ బెడ్స్ 5787 ఉంటే వెంటిలేటర్ బెడ్స్ 2587 ఉన్నట్లు తెలియజేశారు.
అత్యవసరం అయితేనే హాస్పిటల్ కు వెళ్లాలని అనవసరంగా హాస్పిటల్ కు వెళ్లి ఆక్సిజన్ కొరత సృష్టించవద్దని కోరారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నుండి 435 మెట్రిక్ టన్స్ ఆక్సిజన్ ఇంకా ఆక్సిజన్ సమకూర్చుకోవాల్సి ఉందని, రాష్ట్ర లో 125 మెట్రిక్ టన్స్ లభ్యత ఉన్నట్లు, మనకు ఆక్సిజన్ ఒరిస్సా నుండి వస్తుందని దీనికి 6 రోజుల సమయం పడుతుందని అందుకే గ్రీన్ ఛానల్ ద్వారా ఎయిర్ లిఫ్ట్ చేస్తున్నట్లు వివరించారు.
ప్రైవేటు హాస్పిటల్స్ అవసరానికి మించి ఆక్సిజన్ వాడి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని దీనిపై సీనియర్ ఐ.ఏ.యస్. అధికారులు ఆడిటింగ్ నిర్వహించి అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అదేవిధంగా మందులు, ఇంజక్షన్ నిల్వలు అన్ని గవర్నమెంట్ హాస్పిటల్ లో సరిపడా ఉన్నాయని అనవసరంగా వాడి కొరత సృష్టించవద్దని కోరారు. కొరత ఉన్న ఇంజక్షన్ విషయం లో ప్రత్యామ్నాయం ఉపయోగించుకోవాలని సూచించారు.
రాష్ట్రం లో జరిగిన ఫీవర్ సర్వే లో 70 లక్షల ఇళ్ళను సర్వే చేసినట్లు, ఇప్పటి వరకు 5,05,264 ఓ.పి సేవలు నిర్వహించినట్లు అదేవిధంగా 1,67,000 వేల పైచిలుకు కరోనా కిట్స్ పంపిణీ చేయడం జరిగిందని ఈ సర్వేలో 25వేల ఆశా వర్కర్లు, 9 వేల ఏ.ఎన్.యం లు పాల్గొన్నట్లు వివరించారు.
పరిస్థితులు మరికొంత చక్కబడేంత వరకు ప్రజలు అనవసరంగా ఇళ్ళ నుండి బయటకు రావద్దని కోరారు. పెళ్ళిళ్ళు, ఫంక్షన్ల కంటే ప్రాణాలతో ఉండడం ముఖ్యమని ప్రజలు ఇలాగే ప్రభుత్వానికి సహకరించాలని ప్రభుత్వం తరుఫున విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో డి.యం.ఈ. రమేష్ రెడ్డి మాట్లాడుతూ క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి 50వేల మంది సిబ్బందిని మూడు నెలల కాలానికి తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకోవాలని ఆదేశించారని ఈ విపత్కర సమయంలో ప్రజలకు సేవలందించేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఇంతవరకు ఆక్సిజన్ కొరత వలన ఎలాంటి మరణాలు సంభవించలేదని ఇలాంటి వార్తలు ప్రచారం చేయొద్దని, ఆక్సిజన్ నిల్వలు మరియు సరఫరా విషయం లో ఐ.ఏ.యస్ అధికారులు సమీక్షిస్తున్నట్లు కొరత ఏర్పడితే ఆక్సిజన్ సిలిండర్లు సిద్దంగా ఉన్నట్లు అవసరమైన ఆక్సిజన్ నిల్వలు ఉన్నట్లు తెలియజేశారు.
ఇప్పటి వరకు 5 ఆక్సిజన్ జనరేటర్లను స్ధాపించామని అందులో 3 జనరేటర్లు మొదలైనట్లు ఇంకా 51 ఆక్సిజన్ జనరేటర్లకు అనుమతులు లభించినట్లు తెలియజేశారు.
అనవసరంగా బ్లాక్ ఫంగస్ పై అసత్య ప్రచారం చేస్తున్నారని అది అందరికీ సోకదని కేవలం షుగర్ మరియు తక్కువ వ్యాధినిరోదక శక్తి ఉన్నవారికి మాత్రమే బ్లాక్ ఫంగస్ బారిన పడతారని ఇది చాలా తక్కువ మందికి జరుగుతుందని వివరించారు. ఇలాంటి కేసులు గాంధీ హాస్పిటల్ లో 3 కేసులు ఉన్నట్లు అనికూడా ఇతర ప్రైవేటు హాస్పిటల్స్ నుండి వచ్చినట్లు వివరించారు. దీనికి సంబంధించి ఇంజక్షన్ లు హాస్పిటల్ ఫండ్స్ నుండి కొనుగోలు చేసి రోగులకు ఇస్తున్నట్లు వివరించారు.
రెమిడెసివిర్ ఇంజక్షన్ వాడకం పై ప్రత్యేకమైన మార్గదర్శకాలు ఉన్నట్లు అదేవిధంగా టోసిలోజుంబ్ ఇంజక్షన్ గురించి వైద్యులు అవగాహన పెంచుకోవాలని దీని వలన షుగర్ లెవెల్స్ పెరిగి వ్యాధినిరోదక శక్తి తగ్గిపోతుందని అనవసరంగా వీటిని వాడవద్దని కోరారు.
ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుండి 1300 వెంటిలేటర్లు వచ్చినట్లు అందులో 100 వెంటిలేటర్లు పనిచేయడంలేదని, వాటిని సరఫరా చేసే వారికే వాటిని సరిచేసే భాధ్యత ఉంటుందని వివరించారు.
రాష్ట్రంలో ఇప్పటి వరకు పరిస్థితి అదుపులో ఉందని, ఇప్పటి వరకు టోసిలోజుంబ్ ఇంజక్షన్ దరఖాస్తులు పరిస్కరించినట్లు, అవసరమైన బెడ్స్ ఉన్నట్లు ప్రజలు ప్రభుత్వానికి ఇదేవిధంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

(వెంకట్ బెజవాడ, టీ మీడియా అధికార ప్రతినిధి)

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.