కరోనా వైద్యం చేసిన ఆర్ఎంపీలపై చర్యలేవి..?

0
TMedia (Telugu News) :
s s consultancy

అర్హత లేకుండా కరోనా వైద్యం చేసిన ఆర్ఎంపీలపై
చర్యలేవి..?

మొగుళ్ళపల్లి, (టి మీడియా) మే 16 ;- జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి మండలంలో ఎలాంటి అర్హత లేకుండా కరోనా నిర్ధారణ పరీక్షలు చేసి, బాధితులకు కరోనా ట్రీట్మెంట్ ఇచ్చిన అర్హతలేని ఆర్ఎంపీ వైద్యులపై చర్యలేవని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గత వారం రోజులుగా మండలంలో ఒక ఆర్ఎంపీ వైద్యుడు ఎలాంటి అర్హతలు లేకుండానే కరోనా ట్రీట్మెంట్ ఇస్తున్నట్లు సమాచారం. ఇట్టి విషయంపై సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు భయాందోళనకు గురౌవుతున్నారు. ప్రపంచాన్నే కరోనా మహమ్మారి అనే వ్యాధి ప్రజలకు ప్రబలకుండా అధికారులను సమాయత్తం చేస్తున్న తరుణంలో అర్హత లేని ఆర్ఎంపీలు కరోనా నిర్ధారణ పరీక్షల పేరుతో వేలాది రూపాయలను దండుకుని కరోనా ట్రీట్మెంట్ ఇవ్వడం ప్రజలను విస్మయానికి గురిచేస్తుంది. ఇలాంటి తరుణంలో స్పందించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడం దేనికి నిదర్శనమని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మండలంలో అర్హత లేకుండా కరోనా నిర్ధారణ పరీక్షలు చేసి, ట్రీట్మెంట్ ఇచ్చినా సదరు ఆర్ఎంపీపై చర్యలు తీసుకొని కరోనా పేషెంట్లను గుర్తించి తగిన వైద్యం చేయించినట్లయితే కరోనా మహమ్మారిని కట్టడి చేసిన వారవుతారని మండలంలోని ప్రజలు సంబంధిత అధికారులకు విన్నవించుకుంటున్నారు ….

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.