ప్రమాదం..దంపతుల మృతి

0
TMedia (Telugu News) :

అబ్దుల్లాపూర్‌మెట్‌లో ప్రమాదం..దంపతుల మృతి

టీ మీడియా రంగారెడ్డి మే 8: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఈ రోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతిచెందారు. ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మణ్‌, ఆయన భార్య ఝాన్సీ అక్కడికక్కడే మృతిచెందగా మరొకరికి గాయాలయ్యాయి. లక్ష్మణ్ సుల్తాన్‌బజార్‌ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహించేవాడని పోలీసులు గుర్తించారు.
ఈ ప్రమాదం నుంచి మృతిచెందిన దంపతుల ఎనిమిదేళ్ల కుమారుడు సురక్షితంగా బయటపడ్డాడు. ప్రమాద సమయంలో ఝాన్సీ కారు నడుపుతున్నట్లు గుర్తించారు. వీరు సూర్యాపేట నుంచి కారులో హైదరాబాద్‌కు వస్తుండగా ఘటన జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

s s consultancy
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.