కారు బైకు డి… దంపతులు మృతి

0
TMedia (Telugu News) :

జాతీయ రహదారిపై కారు బైకు డి

s s consultancy
  • ప్రమాదంలో మృతి చెందిన దంపతులు

టీ మీడియా అచ్చంపేట జూన్ 6: నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గ పరిధిలో హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం కారు బైకును ఢీకొన్న సంఘటనలో భార్యాభర్తలు ఇద్దరు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. మృతుని బంధువులు తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి జిల్లాలోని అమ్రాబాద్ మండలం మొన్న నూరు గ్రామానికి చెందిన మంతటి సాయి శేఖర్ అతని భార్య లలిత మీనా బామ్మర్ది వివాహానికి శనివారం హాజరై కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపారని తెలిపారు. పై దంపతులకు గత ఎనిమిది నెలల క్రితం వివాహం అయ్యింది వారు హైదరాబాదులో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తూ సహ జీవనం గడుపుతున్నారు. బామ్మర్ది వివాహం అనంతరం ఆదివారం భార్యాభర్తలిద్దరూ తిరిగి హైదరాబాదుకు ద్విచక్ర వాహనంపై హైదరాబాదుకు వెళుతుండగా హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళుతున్న ఇండికా కార్ లో రిటైర్డ్ ఉద్యోగి దంపతులు వెళుతున్నారని తెలిపారు. ఈ క్రమంలో జాతీయ రహదారిపై అచ్చంపేట మండలం గల సిద్దాపూర్ పోలీస్ పరిధిలో వై రోడ్డు జంక్షన్ సమీపంలో పై రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీ కొనడం జరిగింది ఈ ప్రమాదంలో భార్యాభర్తలిద్దరూ సంఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు బంధువులు రోదిస్తూ తెలిపారు. శుభ కార్యానికి వచ్చి అప్పటివరకూ కళ్ళముందు లో ఉన్న దంపతులు రోడ్డు ప్రమాదం ద్వారా విగతజీవులుగా రోడ్డుపై పడి ఉన్న సన్నివేశాన్ని చూసిన కుటుంబ సభ్యులు బంధువుల రోదనలు మిన్నంటాయి.

కేసు నమోదు దర్యాప్తు… ఈ సంఘటన విషయంపై సిద్దాపూర్ ఎస్ఐ రాజు వివరణ కోరగా ప్రమాదం జరిగిన తీరును బట్టి కారు నడుపుతున్న వ్యక్తి తాను వెళ్లాల్సిన మార్గంలో వెళ్లకుండా ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని డి కొట్టడంతో వాహనంపై వెళ్తున్న దంపతులిద్దరూ అక్కడికక్కడే మృతి చెంది నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మృతులను పోస్టుమార్టం కోసం అచ్చంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించామని తెలిపారు. గ్రామంలో విషాదఛాయలు… అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామ అంబేద్కర్ కాలనీకి చెందిన దంపతులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.