జర్నలిస్టుల బాధ్యతలను గుర్తిస్తూ ప్రత్యేక యాప్ ను ప్రారంభించిన సిజేఐ ఎన్వి రమణ

0
TMedia (Telugu News) :

జర్నలిస్టుల బాధ్యతలను గుర్తిస్తూ ప్రత్యేక యాప్ ను ప్రారంభించిన సిజేఐ ఎన్వి రమణ

s s consultancy

టీ–మీడియా ప్రతినిధి (మే 14)జగిత్యాల జిల్లా:

ధర్మపురి పట్టణంలోని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో భారత అత్యున్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్ ఎన్వి రమణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.నిత్యం ప్రజా క్షేమం కోరి సమాజ సేవనే తమ ధ్యేయంగా,వృత్తిగా భావించుకొని జర్నలిస్ట్ కష్టాలను గుర్తించి,పాత్రికేయుల కోసం ప్రత్యేక యాప్ ను తయారు చేసినందుకుగాను ధర్మపురి ప్రెస్ క్లబ్ పక్షాన భారత ప్రభుత్వ అత్యున్నత న్యాయమూర్తి సిజేఐ ఎన్వి రామనకు,యాప్ రూపకల్పనలో ప్రత్యేక శ్రద్ధ చూపిన జస్టిస్ కన్వెనకర్,జస్టిస్ చంద్ర చూడ్, జస్టిస్ ధనంజయ కమిటీకి అభినందనలు తెలిపారు.సిజేఐ ఎన్వి రమణ తన జర్నలిస్ట్ నేపథ్యాన్ని గుర్తు చెసుకుంటూ,వారి కష్టనష్టాలు తెలిసిన వ్యక్తిగా ఈ కరోనా కాలంలో విపరీతంగా వ్యాపిస్తున్న తరుణంలో న్యాయస్థాన వార్త సేకరణను సులభతరం చేస్తూ ప్రత్యేక యాప్ ను రూపొందించి జర్నలిస్టుల క్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపడం పట్ల సమాజంలో జర్నలిస్టుల బాధ్యత ఎంతటిదో అద్దం పడుతుందని,జర్నలిస్టుల క్షేమం కోసం భారత ప్రధాన న్యాయమూర్థుల చొరవ జర్నలిస్టులమైన మాకెంతో గర్వకారణo.అంతేకాకుండా అక్రిడేషన్ల మంజూరులో జర్నలిస్టులకు అన్యాయం జరగకుండా హేతుబద్ద చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం పట్ల మా జర్నలిస్టుల తరుపున కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు.అదేవిధంగా భారత అత్యున్నత న్యాయస్థానానికి మా అభ్యర్థన ఏమిటంటే జర్నలిస్టుల నివాస స్థలాలు మంజూరు విషయమై తమరు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవాలని,భారత ప్రధాన న్యాయస్థానాన్ని ఆర్థిస్తున్నామని అన్నారు.ఈ కరోనా విస్తృత పరిస్థితులలో జర్నలిస్టుల క్షేమం కోరి వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక జర్నలిస్టులకు కోవిడ్ వ్యాక్సినేషన్ టీకా ఇప్పించే దిశగా న్యాయస్థానం తగిన ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాల్సిందిగా అభ్యర్థిస్తున్నమని, జర్నలిస్టుల బాధ్యతలను గుర్తిస్తూ,జర్నలిస్టుల విలువలను గుర్తించి మా పట్ల ప్రత్యేక శ్రద్ధను చూపిన సిజేఐ ఎన్వి రమణకు ధర్మపురి ప్రెస్ క్లబ్ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.