ఆయుష్ సేవలు అభినందనీయం

 మేయర్ డాక్టర్ శిరీష

0
TMedia (Telugu News) :

తిరుపతి

s s consultancy

ఆయుష్ సేవలు అభినందనీయంభినందనీయమని నగర మేయర్ డాక్టర్ శిరీష అన్నారు. శుక్రవారం ఉదయం అన్నారావు సర్కిల్ వద్ద ఉన్న మున్సిపల్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఆయుర్వేద ఆయుష్ విభాగం నేషనల్ మెడికల్ అసోసియేషన్ చిత్తూరు జిల్లా శాఖ సంయుక్తంగా ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష పాల్గొని ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించి స్థానికులకు ఆయుర్వేద మందులను ఆమె పంపిణీ చేశారు.

Also Read:కృష్ణా, గోదావరి జలాల పై కేంద్ర పెత్తనం అత్యంత ప్రమాదకరము

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ మూడో దశ కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులు అవగాహన పెంచుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన ఆయుష్ 64ని రోగనిరోధక శక్తిని పెంపొందించే మందులు కరోనా నివారణ కొరకు కరోనా నుంచి కోలుకున్న వారి కొరకు ఎన్నో లక్షల విలువచేసే ఆయుర్వేద మందులను ప్రజలకు ఉచితంగా అందించడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయించిన కార్పొరేటర్లు శేఖర్ రెడ్డి, లడ్డు భాస్కర్ రెడ్డి, రాజేష్ రెడ్డి, స్రవంతి, నరసింహాచారి, లను మేయర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మురళీ కృష్ణ. అర్ ఎం ఓ డాక్టర్ ప్రభావతి, టౌన్ బ్యాంక్ చైర్మన్ వెంకటేష్ రెడ్డి, వైసీపీ బీసీ నాయకులు అఖిలభారత జిల్లా యువజన అధ్యక్షులు తులసి యాదవ్, ప్రసాద్, కిషోర్, తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.