ఏడు ఎమ్మెల్సీ స్థానాలు.. రెండు రెట్లుఆశావహులు

0
TMedia (Telugu News) :

ఏడు ఎమ్మెల్సీ స్థానాలు..రెండు రెట్లుఆశావహులు

హైదరాబాద్‌,

ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన నేతలు, సొంత పార్టీలో అసంతృప్తులు, సీనియర్‌ నేతలుగా గౌరవించాల్సినవారు.. ఇలా అందరికీ ఒకటే హామీ.. అదే, ‘ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి గౌరవించడం!’. టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ పలువురు నేతలకు ఈ హామీనే ఇచ్చారు. తాజాగా, ఇటీవల నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికల సందర్భంగా టికెట్‌ రేసులో ఉన్న ఎంసీ కోటిరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ సమయమూ వచ్చింది. జూన్‌లో ఏడు ఎమ్మెల్సీ పదవులు ఖాళీ కానున్నాయి. వాటికి అభ్యర్థులను ఎంపిక చేయడం ముఖ్యమంత్రికి ఈసారి పరీక్షగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఆయన చేయబోయే సర్దుబాటుపై సొంత గూటిలోనే ఆసక్తి నెలకొంది. ఏడు ఎమ్మెల్సీ పదవుల్లో ఆరు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల పదవీ కాలం జూన్‌ 3న పూర్తవుతుండగా, గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ పదవీ కాలం అదే నెల 16న పూర్తవుతోంది.

ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ ఖాతాలోనే ఉన్న ఈ స్థానాలు తిరిగి ఆ పార్టీకే దక్కనున్నాయి. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సంఖ్యా బలం దృష్ట్యా వారు ఎమ్మెల్సీలుగా ఏక్రగీవంగా ఎన్నిక కావడం లాంఛనమే. ఇక గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిని కేసీఆర్‌ ఆధ్వర్యంలోని కేబినెట్‌ సిఫారసు చేస్తుంది. ఈ పదవుల కోసం పార్టీలో ఎదురు చూస్తున్న ఆశావహుల సంఖ్య అంతకు రెండు రెట్లు ఎక్కువగా ఉంది. పార్టీ అధిష్ఠానం 2018లో జరిగిన అసెంబ్లీ ముందస్తు ఎన్నికల ముందు నుంచీ అనేక మందికి ఎమ్మెల్సీ పదవి హామీలు ఇస్తూ వస్తోంది. మొన్నటికి మొన్న నాగార్జున సాగర్‌ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక టికెట్‌ రేసులో చివరి వరకు కొనసాగి, భంగపడ్డ ఎంసీ కోటిరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ‘గులాబీ’ బాస్‌ బహిరంగంగానే ప్రకటించారు. గవర్నర్‌ కోటాలో ఖాళీగా ఉన్న మూడు ఎమ్మెల్సీ స్థానాలను జీహెచ్‌ఎంసీ ఎన్నికల ముందు గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్‌తో భర్తీ చేశారు. అప్పట్లో ఎమ్మెల్సీ పదవి ఆశించిన అనేక మందికి నిరాశ తప్పలేదు. దాంతో, వచ్చే ఏడాది(2021)లో భర్తీ చేయాల్సిన ఎమ్మెల్సీ పదవుల్లో నాలుగు బీసీలకు ఇస్తామని సీఎం కేసీఆర్‌ ఆనాడే పార్టీ సమావేశంలో ప్రకటించారు. బీసీల్లోనూ పద్మశాలి, విశ్వబ్రాహ్మణ, నాయీబ్రాహ్మణ, కురుమ సామాజిక వర్గాలకు ఇస్తామని స్పష్టంచేశారు. దాంతో, ఆయా సామాజిక వర్గాల వారు.. ఫలానా పేర్లు పరిశీలించాలని కోరుతూ సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు వినతి పత్రాలు సమర్పించారు.

s s consultancy

సిటింగ్‌ ఎమ్మెల్సీల భవిష్యత్తుపై ఉత్కంఠ

జూన్‌లో పదవీ కాలం ముగియనున్న ఎమ్మెల్సీల్లో శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మండలి డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు, మాజీ మంత్రి మహ్మద్‌ ఫరీదుద్దీన్‌, ఆకుల లలిత, ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు. సిటింగ్‌ల్లో ఎవరికి రెన్యువల్స్‌ ఉంటాయి? కొత్తగా ఎవరికి పదవులు దక్కుతాయి? అనేది తేలాల్సి ఉంది. నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాతే అభ్యర్థుల ఎంపికపై స్పష్టత వస్తుందని సమాచారం. తాజా రాజకీయ పరిణామాల దరిమిలా సామాజిక కోణంలో అభ్యర్థుల ఎంపిక కీలకమవుతుందని చెబుతున్నారు.

నోటిఫికేషన్‌పై ఈసీదే తుది నిర్ణయం

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ కోసం కేంద్ర ఎన్నికల సంఘం వచ్చే వారంలో నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశంఉందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియ పూర్తి కావటానికి 20 రోజుల సమయం పడుతుంది. ఈ లెక్కన వచ్చే వారంలోనే నోటిఫికేషన్‌ జారీ కావాలి. అయితే, కరోనా నేపథ్యంలో ఎన్నికలను ఈసీ నిర్వహిస్తుందా? వాయిదా వేస్తుందా? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.

సమీకరణాల క్యూ

వివిధ సమీకరణాల నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్న వారి పేర్లు చాంతాడును తలపిస్తున్నాయి. వాటిలో మాజీ స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి, ఎస్సీ-ఎస్టీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, టీఆర్‌ఎ్‌సఎల్పీ కార్యాలయ కార్యదర్శి మాదాడి రమేశ్‌రెడ్డి, కరీంనగర్‌ మాజీ మేయర్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌, మాజీ ఎంపీలు సీతారాంనాయక్‌, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, సీనియర్‌నేతలు బొమ్మెర రామ్మూర్తి, తక్కళ్లపల్లి రవీందర్‌ రావు, రావుల శ్రవణ్‌కుమార్‌ రెడ్డి, బండి రమేశ్‌, ఎన్‌.సుధాకర్‌రావు, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌, ప్రభుత్వ మాజీ విప్‌ కర్నె ప్రభాకర్‌, ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ పిడమర్తి రవి, తుల ఉమ, చాడ కిషన్‌ రెడ్డి, ఆర్‌.సత్యనారాయణ, అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, నాయకులు తాడూరి శ్రీనివాస్‌, క్యామ మల్లేశం, పీఎల్‌ శ్రీనివాస్‌ తదితరుల పేర్లు చర్చకు వస్తున్నాయి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.