ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి, టీవీ-5పై కేసులు

0
TMedia (Telugu News) :

అమరావతి/న్యూఢిల్లీ

ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి, టీవీ-5పై కేసులు

సీఐడీ తీరుపై జర్నలిస్టు సంఘాల నిరసన

  • ఇది కక్ష సాధింపు ధోరణేనని మండిపాటు
  • భావ ప్రకటనా స్వేచ్ఛ కుట్ర ఎలా అవుతుందని ప్రశ్న

★ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారంలో మీడియా సంస్థలపై సీఐడీ కేసులు పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

★ ఇది భావ ప్రకటనపై దాడేనని రాజకీయ వర్గాలు, జర్నలిస్టు సంఘాలు, మేధావి వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

s s consultancy

★ రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాలన్నీ సామాజిక మాధ్యమాల ద్వారానే విలేకరులకు సమాచారం చేరవేస్తున్నాయి.

★ మీడియాకు సమాచారం పంపేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా వాట్సప్‌ గ్రూప్‌ను వాడుతోంది.

★ అందులో వచ్చే అంశాలను వార్తాసంస్థలు, మీడియా ప్రతినిదులు వినియోగిస్తున్నారు.

★ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా తన అభిప్రాయాలను వెల్లడించేందుకు మీడియా సంస్థల విలేకరులతో ఒక గ్రూప్‌ను ఏర్పాటు చేశారు.

★ ఆయన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లకు సంబంధించిన సమాచారాన్ని అందులోనే పంపేవారు.

★ ఇందులో పలు మీడియా సంస్థల ప్రతినిధులు ఉన్నప్పటికీ ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి, టీవీ-5 సంస్థల ప్రతినిధులపై కేసులు పెట్టడాన్ని రాజకీయ పక్షాలు, జర్నలిస్టు సంఘాలు, మేధావి వర్గాలు తప్పుబడుతున్నాయి.

★ సమాచారం ఇవ్వడం కోసం రాజకీయ పార్టీలు ఒక గ్రూప్‌ను ప్రారంభిస్తే అందులో ఉన్న మీడియా ప్రతినిధులపై కేసులు పెట్టడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.