ఒక్క రోజే 4లక్షల కరోనా కేసులు నమోదు*

0
TMedia (Telugu News) :
s s consultancy

భారతదేశంలో ఒక్క రోజే 4లక్షల కరోనా కేసులు నమోదు*
టి-మీడియా/హైదరాబాద్ (మే-8):-
*మహారాష్ట్ర, కర్ణాటక లో పెరుగుతున్న కేసులు.
*ఒక్క రోజే 4వేల పైగా మరణాలు.
*ఆందోళనలో తెలుగు రాష్ట్రాలు.

భారత దేశంలో కరోనా విలయతాండవం ఇప్పట్లో తగ్గేలా కనిపించడంలేదు. ప్రతిరోజు పెరుగుతున్న కేసులు, మరణాలను చూస్తే ఈ అనుమానం రాకమానదు. భారత్ లో కొత్త కేసులలో పాటు, మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఐతే ప్రపంచ దేశాలతో సరి చూసుకుంటే మాత్రం మరణాలు తక్కువగానే నమోదవుతున్నాయి.
ఇండియాలో కొతగ 4,01,078 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2,18,92,676 కాగా మరణాలు 2,38,270 కి చేరాయి. భారత్ లో మరణాల రేటు 1.1 శాతంగా ఉంది. తాజాగా 3,18,609 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 1,79,30,960 కి చేరింది. మొత్తంగా రికవరీ రేటు 81.9 శాతంగా ఉంది. భారత్ లో ప్రస్తుతం 37,23,346 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 18,08,344 మందికి కరోనా టెస్టులు చేశారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 30,04,10,043 టెస్టులు చేశారు. వ్యాక్సిన్ పరంగా ఇప్పటి వరకు 16,73,46,544 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు, కొత్తగా 22,97,257 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇండియా లో ఇప్పటికి వరకు 78,282 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. మరణాలు కూడా 4 వేలకు పైగా నమోదయ్యాయి.
మహారాష్ట్ర లో కొత్తగా 54,022 కేసులు నమోదవ్వగా 898 మంది చనిపోయారు. అలాగే కర్ణాటక లో 48,781 కేసులు నమోదవ్వగా 592 మంది చనిపోయారు. అదే విధంగా కేరళ లో నిన్న ఒక్క రోజే 38,460కేసులు రాగా 54 మంది చనిపోయారు. తమిళనాడులో నిన్న 26,465 కేసులు నమోదవ్వగా 197 మంది చనిపోయారు. తెలుగు రాష్ట్రాల చుట్టూ ఉన్న రాష్ట్రాలలో కరోనా కేసులు పెరుగుతుండటం తో రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రజలు కూడా ఏమీ చేయలేని పరిస్థితి లో ఉన్నారు.
(వెంకట్ బెజవాడ, టీ మీడియా, అధికార ప్రతినిధి)

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.