రైతులకు శుభవార్త.. అకౌంట్లలోకి రూ.2 వేలు

0
TMedia (Telugu News) :

రైతులకు శుభవార్త.. అకౌంట్లలోకి రూ.2 వేలు
టి-మీడియా/న్యూఢిల్లీ(మే-14):
*అన్నదాతల ఖాతా లో 2000 జమ.
*9.5 కోట్ల మంది రైతులకు ప్రయోజనం.
*20వేల కోట్లు ట్రాన్స్ఫర్ చేసిన కేంద్రం.

s s consultancy

రైతుల నిరీక్షణకు తెరపడింది. కేంద్ర ప్రభుత్వం రైతులకు తీపికబురు అందించింది. అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు పీఎం కిసాన్ స్కీమ్ డబ్బులు జమ చేసింది. 9.5 కోట్ల మంది రైతులకు అకౌంట్లలోకి రూ.20 వేల కోట్లు ట్రాన్స్‌ఫర్ చేసింది. కరోనా కష్ట కాలంలో రైతులకు ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు.
కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ డబ్బులను ఏప్రిల్ నెలలోనే రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. అయితే ఈసారి ఈ డబ్బులు చాలా ఆలస్యంగా వచ్చాయని చెప్పుకోవచ్చు. మోదీ సర్కార్ పీఎం కిసాన్ డబ్బులను ఈరోజు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది.
మోదీ సర్కార్ ఇప్పుడు వేసేది పీఎం కిసాన్ 8వ విడత డబ్బులు. ఇప్పటికే 7 విడతల డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యింది. మీకు పీఎం కిసాన్ స్కీమ్ కింద రూ.2 వేలు వచ్చాయా? లేదా? అని సులభంగానే తెలుసుకోవచ్చు. దీని కోసం మీరు పీఎం కిసాన్ వెబ్‌సైట్‌కు వెళ్లి బెనిఫీసియరీ స్టేటస్‌పై క్లిక్ చేసి డబ్బులు వచ్చాయో లేదో తెలుసుకోవచ్చు.
కాగా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం పీఎం కిసాన్ స్కీమ్ కింద రైతులకు రూ.6 వేలు అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ డబ్బులు ఒకేసారి కాకుండా భమూడు విడతల్లో అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో జమవుతాయి. అంటే రూ.2 వేల చొప్పున జమవుతాయి తెలియజేశారు.

(వెంకట్ బెజవాడ, టీ మీడియా అధికార ప్రతినిధి)

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.