ఎప్రియేల్ 8కి ముందు వ్యాక్షన్ వేయించు కొన్న వారికే రెండవ డోస్

0
TMedia (Telugu News) :

ఎప్రియేల్ 8కి ముందు వ్యాక్షన్ వేయించు కొన్న వారికే రెండవ డోస్

డైరెక్టర్ ఆఫ్ హెల్త్ , తెలంగాణ ఆదేశాల మేరకు మే 8వ తేదీ నుండి 12 వ వరకు 2వ డోస్ కోవిడ్ వాక్సిన్ నిలిపి వేస్తున్నట్లు బద్రాద్రి కొత్తగూడెంజిల్లా కలెక్టర్ డా యంవి రెడ్డి శనివారం ఒక ప్రకటన లో తెలిపారు. కోవాక్సిన్ కానీ , కోవిషీల్డ్ కానీ , మొదటి డోస్ 12వ తేదీ వరకు ఎవరికీ వేయరాదని చెప్పారు.
భద్రాద్రి జిల్లా కోవిడ్ వాక్సిన్ షెడ్యూలు::-

తేదీ: 09.05.2021 నాడు ఆదివారం ప్రభుత్వ సెలవు కాబట్టి వాక్సిన్ సెషన్ లేదని చెప్పారు.

తేదీ: 10.05.2021 నాడు కోవాక్సిన్ 2వ డోస్ వారికి వాక్సిన్ సెషన్ నిర్వహించబడుతుందని (ఏప్రిల్ 8 కి పూర్వం కోవాక్సిన్ మొదటి డోస్ వేయించుకున్న వాళ్ళకు మాత్రమే ఈ 2వ డోస్ ఇవ్వబడుతుందని చెప్పారు.
మిగతా వారికి తదుపరి దశలో వాక్సిన్ ఇవ్వబడుతుందని చెప్పారు.

ఈ 2వ డోస్ టీకా కార్యక్రమం జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో( కోవిడ్ వాక్సిన్ కేంద్రాల్లో) జరుగుతుందని, నేరుగా ప్రభుత్వ వాక్సిన్ కేంద్రానికి వెళ్లి 2వ డోస్ వాక్సిన్ తీసుకోవచ్చునని, మీ రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్ (లేదా) 1వ డోస్ వేయించుకున్నపుడు తీసుకున్న సర్టిఫికెట్ మరియు ఆధార్ కార్డ్ ను తప్పక మీ వెంట తీసుకు వెళ్లాలని, ఆన్లైన్ లో స్లాట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు.

s s consultancy

వాక్సిన్ కేంద్రo వద్ద తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, 6 అడుగుల భౌతిక దూరం పాటించి వైద్య సిబ్బందికి సహకరించాలని చెప్పారు.

రెండో డోసు కోసం వెళ్లే వారు వెంట తీసుకెళ్లాల్సినవి*

★తొలిడోసు సందర్భంగా ఏదైతే గుర్తింపు కార్డును ఇచ్చారో.. అదే తీసుకెళ్లాలి.

◆తొలిడోసు సమ యంలో ఇచ్చిన ఫోన్ నంబరునే ఇప్పుడూ ఇవ్వాలి. మొదటి టీకా

◆పొందినట్లుగా ఫోన్ నంబరుకు వచ్చిన ఎస్ఎంఎస్ చూపించినా సరిపోతుంది.

◆తొలి వ్యాక్సిన్ తీసుకున్నట్లుగా ధ్రువప త్రాన్ని అయినా ఇవ్వవచ్చు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.