డి.ఇ.సి & అల్బెండ జోల్ మాత్రలు ద్వారా బోదకాలు , నులిపురుగులను నివారించవచ్చు .

24వ డివిజన్ కార్పోరేటర్ కమర్తపు మురళి

0
TMedia (Telugu News) :

ఖమ్మం : 24వ డివిజన్ శంకర్ బజార్లో జాతీయ బోదకాలు , నులిపురుగుల నివారణ కార్యక్రమంలో భాగంగా గురువారం నాడు ఉచిత అల్బెండ జోల్ మాత్రలు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక కార్పోరేటర్ కమర్తపు మురళి గారు పాల్గొని సూపర్ వైజర్ పుష్పలత , అంగన్వాడీ టీచర్లు సుజనా , విజయ , ఆయాలు కళావతి , వీణా , ఆశ వర్కర్ నాగమణి , C , O సత్యనారాయణతో కలిసి డివిజన్ లో నివసించే పిల్లలకు , పెద్దలకు అందించారు .

Also Read:గిరిజనులను దోపిడీ చేస్తున్న మీసేవ సెంటర్

s s consultancy

అనంతరం వారు ఇంటింటికీ తిరుగుతూ బోదకాలు , నులిపురుగుల నివారణ చేపట్టే కార్యక్రమం 2004 సం॥ నుండి మన రాష్ట్రములో అమలులో ఉందని , డి.ఇ.సి. మాత్రలు సూక్ష్మ ఫైలేరియాను నశింపజేస్తుందని , ఆల్బెండజోల్ మాత్రలు పేగుల్లో ఉండే క్రిముల్ని నిర్మూలించి అదనపు లాభం చేకూరుస్తుందని , ఈ రెండింటిని కలిపి ఇవ్వడం ద్వారా పెరిగిన క్రిముల మీద ప్రభావం చూపిస్తుందని , రోగాభివృద్ధిని నిరోధించేందుకు పరాన్న జీవులను నశింపజేసి ఫైలేరియా నిర్మూలనతో పాటు దోమల ద్వారా రోగం వ్యాప్తి చెందకుండా ఉంటుందని అవగాహన కల్పించారు . గర్భవతులు , చిన్నపిల్లలు ( రెండేళ్ళ వయస్సు లోబడినవారు ) ఇతర తీవ్రరుగ్మతల బాధపడేవారు డి.ఇ.సి. మాత్రలు తీసుకోరాదని సూచించారు .

Also Read:యాదాద్రిలో నీటమునిగిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ రహమాన్ , డివిజన్ ఎస్సీసెల్ సెక్రటరీ కడారి వెంకన్న , గౌరవ అధ్యక్షులు తాజుద్దీన్ , డివిజన్ యువజన నాయకులు మనోహర్ , చందు , డివిజన్ మహిళా నాయకురాలు కవిత , మంజు డివిజన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు .

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.