ఆర్టీసీ కార్మికుల ఐక్యతే మాకు మొదటి ప్రాధాన్యం

ఖSWF జనరల్ బాడీ లో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణ వెంకటేశ్వర రావుమ్మం.

0
TMedia (Telugu News) :

 

swf new depot comitee

ఐక్య పోరాటాలు ఒరవడిని కొనసాగిస్తాం

ఆర్టీసీ ఎస్ డబ్ల్యూ ఎఫ్ ను నష్ట పరచాలని చూస్తే మరింతగా బలపడతాం

హక్కుల సాధన కోసం జరిగే పోరాటంలో ఎస్ డబ్ల్యూ యఫ్ కార్యకర్తలు ముందుండాలని, వేతనాల పెంపుదల కోసం ఆర్టీసీ కార్మికులు పోరాడుతుంటే,సకాలంలో వేతనాలు రాని పరిస్థితుల్లో ఉన్నారని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణ వెంకటేశ్వర రావు ఆందోళన వ్యక్తం చేశారు.

s s consultancy

Also Readమాటున అడ్డ  వ్యవహారం:

బుధవారం ఉదయం ఖమ్మంలోని మంచికంటి భవన్లో గుండు మాధవ రావు అధ్యక్షతన ఏర్పాటయిన స్టాప్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్(సిఐటియూఅనుబంధం) ఖమ్మం డిపో జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్న వెంకటేశ్వరరావు ప్రసంగిస్తూ, ఆర్టీసీ కార్మికులపై పనిభారం పెంచి ఈ పి కే, కె ఎం పి ఎల్ బస్సు ఫెయిల్యూర్స్ పేర వేధింపులు చేయడం శోచనీయమని పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులపై పెరుగుతున్న పని భారాలు, వేధింపులు, సమస్యల పరిష్కారానికై ఐక్యంగా కలిసి పోరాడాల్సిన కార్మిక సంఘాలు, ఐక్యంగా ఉండాల్సిన సమయంలో ఖమ్మం డిపోలో ఒక సంఘం తమ కుత్సితపు బుద్ధితో చిన్న సమస్యపై ఒక యూనియన్ రీజియన్ కార్యదర్శిపై చర్య తీసుకోవాల యాజమాన్యాన్ని కోరడం ఎలా సమర్థించుకుంటారో ఆ సంఘంలో ఉన్నటువంటి సభ్యులు ఆలోచించుకోవాలని సూచించారు. ఎవరెవరు కుట్రలు,కుతంత్రాలు ప్రదర్శించినా ఆర్టీసీ ఎస్ డబ్ల్యూ ఎఫ్ కు ఎవరు నష్టం కలిగించినా అంతకు రెట్టింపుగా ఈ రీజియన్లో బలపడ్డామని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల పని పరిస్థితుల మెరుగు కోసం,సమస్యల పరిష్కారం కోసం స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఐక్య పోరాటాల ఒరవడిని కొనసాగిస్తుందని ప్రకటించారు.

Also Read:లండన్ లో తెలంగాణ బోనాలు

రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ గడ్డం లింగమూర్తి ప్రసంగిస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక వర్గం పై పని భారం వేధింపులు పెరిగాయని ఫలితంగా రాణిగంజ్-2 డిపోలో తిరుపతిరెడ్డి ఆత్మహత్య వరంగల్, కోదాడ డిపోలలోఆత్మహత్యా యత్నాలు జరిగాయని తెలిపారు. కార్మిక సంఘాల కార్యకలాపాలు లేవనే కారణంతో ఆర్టీసీ యాజమాన్యం కార్మికులపై పనిభారం పెంచి వేధించడం సరికాదని, తమ ఉద్యోగాల పట్ల పని పరిస్థితుల పట్ల ఆందోళనగా ఉన్న కార్మిక వర్గానికి సమస్యల పరిష్కారానికై భరోసా ఇవ్వడం కోసం ఆర్టీసీ కార్మిక వర్గాన్ని ఐక్యంగా పోరాటంలో నిలపడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా పది కార్మిక సంఘాలతో ఐక్య కార్యాచరణ కమిటీ ఏర్పాటైందని అందువలన జేఏసీ పిలుపులు జయప్రదం చేయడం కోసం ఐక్యంగా ఉండాలని సూచించారు.
జనరల్ బాడీ సమావేశం చర్చల్లో డిపోలోని సమస్యలను పలువురు కార్మికులు ప్రస్తావిస్తూ, డిపోలో బస్సుల కండీషన్ సరిగాలేదని, ప్రశాంతంగా, మనస్ఫూర్తిగా డ్యూటీ చేసుకునే పరిస్థితులు లేవని, డిపో గ్యారేజ్ లో సరైన స్పేర్ పార్ట్స్ లేవని గ్యారేజి సిబ్బంది సరిపోను లేని కారణంగా వారిపై పని భారం పెరిగిందని, టిక్కెట్లు ఇచ్చే మిషన్లు సరిగా పనిచేయడం లేదని, హైదరాబాద్ సెక్టార్ లో నైట్ వెళ్లే టిమ్ సర్వీసులకు రెండు రోజుల మస్టరు ఇవ్వాలని, ఈ పి కె, కె ఎమ్ పి ఎల్ పేరుతో వేధింపులు ఆపాలని కార్మికులు కోరారు.
నూతన అధ్యక్ష, కార్యదర్శుల ఎన్నిక
జనరల్ బాడీ సమావేశంలో డిపో కమిటీ నూతన అధ్యక్షులుగా సిరిపురపు సీతారామయ్య, కార్యదర్శిగా గుండు మాధవరావు, ఉపాధ్యక్షులుగా పాకాలపాటి సంపత్ కుమార్, కోశాధికారిగా గుగ్గిళ్ల రోశయ్య లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Also Read:వృత్తులపై నైపుణ్యతలు పెంచే దారులేవి.

ఈ సమావేశంలో రీజియన్ అధ్యక్షులు ఎర్రంశెట్టి వెంకటేశ్వర్లు కోశాధికారి పర్వీనా ప్రచార కార్యదర్శి పిట్టల సుధాకర్ రీజనల్ సహాయ కార్యదర్శి తోకల బాబు డిపో కమిటీ నాయకులు సరితా,శాంతకుమారి, శోభారాణి, ఉమారాణి, రాధా ,బుగ్గవీటి లింగమూర్తి బసవయ్య నరసింహారావు ఎండీ గౌస్ పాషా, దొంగరి ఉపేందర్, ఆర్ నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.