22 ఏళ్ల సేవలకు 22 తో ముగింపు

-ప్రభుత్వం అనుమతి ఇస్తే కొనసాగిస్తాము;యాజన్యంమా

0
TMedia (Telugu News) :

-100 మంది ఉద్యోగుల ఉపాధి గల్లంతు
(టీమీడియా ప్రత్యేక ప్రతినిధి)

 

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఆనాటి ప్రభుత్వ పెద్దలు(నేడు ఉన్నారు) వారి సహకారం తో 1999 లో హైదరాబాద్ రిజిస్టర్ శాఖలో పచ్ఛిమ గోదావరి తణుకు అడ్రెస్ తో గౌతమి * బయో ఇంజనీర్స్ ప్రవైట్ లిమిటెడ్ రిజిస్టర్ అయింది. నేటికి కార్పొరేట్ అఫిస్ హైదరాబాద్ లో కొనసాగిస్తున్నారు.అనుబంధం గా *గౌతమి బయో ఎనర్జి ప్రవైట్ లిమిటెడ్తెలంగాణ లోని ఖమ్మం నగరం గోపాల పురం లో నెలకొల్పారు.అక్కడ ఉత్పత్తి అయిన విద్యుత్ ను ప్రస్తుత ఖానపురం సబ్ స్టేషన్. ద్వారా సరఫరా చేస్తున్నారు. జులై 22 తో అగ్రిమెంట్ కాలం ముగుస్తుంది. ప్లాంట్ మూసి వేస్తున్నామని.ఈనెల 18న కార్మికుల జనరల్ బాడీ పెట్టి చెప్పారు 100 మంది ఉపాది కోల్పోనున్నారు.ఉద్యోగం కోల్పోయిన వారి బాధ తెలుసని, వస్తామంటే ఏపీ లోని పెద్దాపురం లోని మరో ప్లాంట్ లు ఉద్యోగం ఇస్తామని,ఒక నెల జీతం బోనస్ గా చెల్లిస్తున్నామని,ప్రభుత్వం అనుమతి ఇస్తే ప్లాంట్ తిరిగి నడపడం కు సిద్ధం అని సంస్థ ఎండి ఏం. రవికాంత్ *టీమీడియా ప్రతినిధి తో అన్నారు.

Also Read:ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే సండ్ర

చరిత్ర ఇదీ
1999 లో ఆనాటి ఖమ్మం అర్బన్ మండలం గోపాలపురం లో గ్రామం బైట ఈ పరిశ్రమ 6 మెగావాట్ల ఉత్పత్తి సామర్ధ్యం తో నెలకొల్పారు. విద్యుత్ కొరత తీవ్రంగా ఉన్న ఆ రోజుల్లో ప్రభుత్వం కొనుగోలు చేసి ఖమ్మం నగరం కు సరఫరా చేయిస్తూ వస్తున్నారు.పెద్ద దిక్కుగా ఈ పరిశ్రమ నాటి నుండి నేటి వరకు ఉంది..స్థానికులు కు ఉపాది దొరికింది.రెండు దశాబ్దాల నుండి అక్కడే పనిచేస్తున్న గోపాలపురం వాసులు ఉన్నారు.. రాష్ట్రం విడిపోయిన కార్పొరేట్ అఫిస్ తెలంగాణ లోనే ఉంచి ప్లాంట్ ను యాజమాన్యం నిర్వహిస్తూ వస్తోంది.కాలుష్యం వస్తోంది..అని స్థానికులు,రైతులు పలుమార్లు ఆందోళనలు చేస్తే వారికి ప్రత్యన్నమాయం ఏర్పాటు చేయడం తో సిబ్బంది కి ప్రతినెల ప్రస్తుత కరోన కాలం లో కూడా 5 వతేది లోపు వేతనాలు బకాయి లేకుండా చెల్లింపు లు చేస్తున్నది.22 ఏళ్లలో ఎన్నడూ కార్మికులు సమ్మెలు,ధర్నాలు చేసిన చరిత్ర లేక పోవడం యాజమాన్య పద్దతి తెలుపుతోంది.

Also Read:ప్రెస్ క్లబ్ భవన స్థలానికి సహకరిస్తాం.— ఎమ్మెల్యే దివాకర్ రావు.

s s consultancy

కార్మికుల తో ఎండి భేటి

సంస్థ మేనేజింగ్ డైరెక్టేర్ ఏం రవికాంత్ ఖమ్మం వచ్చి పవర్ ప్లాంట్ లోని కార్మికుల తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. మూసివేతకు కారణాలు తెలిపారు.నెల జీతం బోనస్ గా ఇస్తామన్నారు.కోరిన వారికి పెద్దాపురం లోని పవర్ ప్లాంట్ ఇదే హోదా లో ప్రత్యన్నమాయ ఉద్యోగం ఇస్తామన్నారు.ఎవరిని తీసివేయడం లేదు అని .ప్రభుత్వము వప్పదం అయితే తిరిగి తీసుకుంటామన్నారు.

Also Read:చెరువు కట్ట  కంప తీసుకున్న స్విమ్మర్స్ కమిటీ సభ్యులు

 

రేటు ఎక్కువ కావడమేనా

ప్రభుత్వం బయో విద్యుత్ కొనుగోలుకు సుముఖం గా లేకపోవడం కు రేటు ఎక్కువ అనేది తెలుస్తోంది.ఒక యూనిట్ ధర బయో ది 5రూపాయల 50 పైసలు వరకు పడుతోంది.ఉమ్మడి రాష్ట్రం లో మొత్తం 45 ప్లాంట్ లు ప్రారంభం అవగా ఇప్పటికే 35 మూత పడ్డాయి..మిగిలిన 7 కూడా మూత దిశలో ఉన్నాయి. ఉత్పత్తి అయిన విద్యుత్ కొనే వారు లేక పోవడం కారణం గా తెలుస్తోంది.

Also Read:దేశంలోనే సీఎం జగన్ అరుదైన రికార్డు

ప్రత్యన్నామాయం కల్పిస్తాము;ఎండి
ఖమ్మం గౌతమి బయో ఎనర్జీ లో పని చేసే ఏ ఒక్కరినీ తొలగించడం లెదు అని సంస్థ ఎండి ఏం రవికాంత్ టీమీడియా కి తెలిపారు.ఇక్కడ పని లేదు కాబట్టి మరో చోట కి బదిలీ చేసి ప్రత్యన్నామయం కల్పిస్తున్న మన్నారు.ఏ ఒక్క కార్మికుడికి వేతన బకాయి లేదునన్నారు..ఏడాది కాలం గా ప్రభుత్వం నుండి బిల్లులు రాలేదని అన్నారు.అయిన బకాయిలు ఉంచలేదన్నారు.స్వయం గా కార్మికుల తో ఖమ్మం లోని పరిశ్రమ లో భేటి అయ్యానని అన్నారు.ప్రభుత్వం తిరిగి అనుమతి ఇస్తే నడప డానికి అబ్యతరం లేదన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.