కరోనా లేని.. సేఫ్ జోన్ లో సీతంపేట.:సర్పంచ్ కి అభినందన —

0
TMedia (Telugu News) :

కరోనా లేని.. సేఫ్ జోన్ లో సీతంపేట.:సర్పంచ్ కి అభినందన
—/
     

s s consultancy

టి మీడియా చింతకాని 26.  ధేశంలో, రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రతి గ్రామంలో విలయతాండవం చేస్తూ ఎందరో ప్రాణాలను బలి తీసుకుంటున్న ఈ రోజు ల్లో కరోనా మహమ్మారిని సీతంపేట గ్రామ ప్రజలు కలిసికట్టుగా  గ్రామ సర్పంచ్ నారపోగు కొండలరావు ఆధ్వర్యంలో  జయించ గలుగుతున్నారు. గత సంవత్సరం లో మొదలైన కరోనా ఏ ఒక్కరి కి సోకకుండా జాగ్రత్త లు తీసుకోవడం గమనార్హం,కరోనా సెకండ్ వేవ్ లో వేగం గా ప్రతిగ్రామాన్నిముట్టడించినకరోనా.సీతంపేటగ్రామంలోఇద్దరువ్యక్తులకుస్వల్పంగా వచ్చి తగ్గిపోయింది.ధీంతో గ్రామాన్ని ప్రత్యేక దృష్టి తో సర్పంచ్ నారపోగుకొండలరావు  గ్రామాన్ని హైపో క్లోరైడ్ తో, బ్లీచింగ్ పౌడర్ చల్లి, గ్రామ ప్రజల్ని కరోనా బారిన పడకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటూ, చాటింపు వేయించడం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా కాపాడగలుగుతున్నాడు., ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలకు మాస్క్ లు, భౌతిక దూరం పాటించాలని చెప్పడం, ఎప్పటికప్పుడు పరిసరాల పరిశుభ్రత పట్ల ప్రజలకు అవగాహన కల్పించడంతో గ్రామంలో కరోనా వచ్చిన వాళ్ళు.ఒక్కరూ లేకపోవడంతో గ్రామపంచాయతీ సర్పంచ్ నారపోగు కొండలరావు ని మండల అధికారులు అభినందించారు. గ్రామాన్ని సందర్శించి అధికారులు ఎమ్మార్వో తిరుమల చారి, ఎస్ఐ ఆర్ ఉమ, ఎంపీ డివో లలిత కుమారి, ఎంపిఓ రవీందర్ ప్రసాద్, సర్పంచ్ కొండలరావు అభినందించారు. ఈసంధర్బంగా కొండలరావు మాట్లాడుతూ గ్రామంలో ప్రధానంగా దేవాలయాలు మసీదు ప్రార్థన మందిరాలు

మినరల్ వాటర్ ప్లాంట్, గ్రామంలో ప్రధాన వీధుల్లో గుంపులు గుంపులుగా ఉండకుండా చూసుకోవడం, ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలకు మాస్క్ లు, భౌతిక దూరం పాటించాలని అప్రమత్తంగా ఉండాలని మనోధైర్యం తో ఉండాలని కోరడంతో గ్రామ ప్రజలు సహకరించి  సహాయ సహకారాలు అందించి గ్రామంలో కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.